Site icon NTV Telugu

IPL 2022 : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌

Gt Vs Kkr

Gt Vs Kkr

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్‌లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్‌ స్టేడియ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌కు ఆదిలోని షాక్‌ తగిలింది.

సౌథీ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (5 బంతుల్లో 7; ఫోర్‌) ఔటయ్యాడు. రెండో ఓవర్‌లోనే గిల్‌ వికెట్‌ పడటంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఆచితూచి ఆడుతుంది. వన్‌డౌన్‌లో వచ్చిన హార్ధిక్‌ పాండ్యా 17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేయగా, సాహా 14 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 16 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.

తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, సునీల్‌ నరైన్‌, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, రింకూ సింగ్‌ (వికెట్‌కీపర్‌), ఆండ్రీ రస్సెల్, టిమ్‌ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్‌ మనోహర్‌, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్‌, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్

Exit mobile version