NTV Telugu Site icon

IPL 2022: వచ్చే IPL కి ముందే ఆ నలుగురిని వదిలేయనున్న హైదరాబాద్..

New Project 2022 04 12t151354.816

New Project 2022 04 12t151354.816

IPL 2022 మొదట వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించినప్పటికీ తరువాత వరుస ఓటములతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక అభిమానులను నిరాశపరిచి, సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.

ఈ సీజన్ సన్‌రైజర్స్ కి కలిసిరాకపోయినా ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అయితే మిగతా ఆటగాళ్లలో కొంతమంది స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. అందులోని ఓ నలుగురిని సన్‌రైజర్స్ వచ్చే సీజన్ ముందు వదిలేయనుంది. మరి వారెవరో ఓసారి చూద్దాం..

1. సీన్ అబాట్..

IPL 2022 మెగా వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్‌ను సన్‌రైజర్స్ రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. BBL అనుభవం , అక్కడి ప్రదర్శన ఆధారంగా సన్‌రైజర్స్ తీసుకోగా అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతను ఓవర్‌కు 11.75 చొప్పున 47 పరుగులు సమర్పించుకున్నాడు.

2. ఫజల్హాఖ్ ఫరూఖీ

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఫజల్హాఖ్ ఫరూఖీని సైతం సన్‌రైజర్స్ వదిలేయాలనుకుంటుంది. ఐపీఎల్ మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేయడంతో ఫరూఖీ స్థాయి పెరిగింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు మ్యాచ్‌ల్లో 6 ఎకానమీతో 6 వికెట్లు తీసిన ఫరూఖీ.. వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

3. శ్రేయాస్ గోపాల్

స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా శ్రేయాస్ గోపాల్‌ను తీసుకుంది సన్‌రైజర్స్. కానీ అతను ఆశించిన రీతిలో రాణించకపోవడంతో వదిలేయాలనుకుంటుంది. అతనికి బదులు వాషింగ్టన్ సుందర్,జగదీష్ సుచిత్‌లనే ఎక్కువ అవకాశాలిచ్చింది. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శ్రేయాస్ గోపాల్ 11.33 ఎకానమీతో 34 పరుగులిచ్చాడు. ఓ వికెట్ తీసాడు.

4. అబ్దుల్ సమద్

విధ్వంసకర బ్యాట్స్‌మన్ అబ్దుల్ సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయాలనే ఆలోచనలో ఉంది. ఈ యువ హిట్టర్‌పై ఎంతో నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇచ్చినా అతను మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు, IPL 2022 సీజన్‌ మెగావేలానికి ముందే ఈ యువ హిట్టర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంది.కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు