ఐపీఎల్ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్‌లో మూడు స్థానాల గురించి క్లారిటీ రాగా.. మరో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి.
కాగా ఈనెల 29న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6:30 గంటల నుంచి 7:20 గంటల వరకు బాలీవుడ్ తారలతో ఐపీఎల్ ముగింపు వేడుకలు జరుగుతాయి. దీంతో 7:30 గంటలకు టాస్ వేయనున్నారు. అటు మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.
IPL 2022: ఒక్క ఇన్నింగ్స్‌తో రికార్డుల వర్షం కురిపించిన డికాక్
కాగా వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచ్ టైమింగ్స్ మారనున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం అవుతుండగా.. వచ్చే ఏడాది మధ్యాహ్నం మ్యాచ్ 4 గంటలకు, రాత్రి మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం అయ్యేలా బీసీసీఐ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.