NTV Telugu Site icon

IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు

Inzamam On Rahul Dravid

Inzamam On Rahul Dravid

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్‌లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి, 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్స్ లేకపోయినా, ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని అన్నాడు. ఈ జట్టు వెనుక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని, అతను ఉన్నంతవరకూ స్వేదశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని తెలిపాడు. ‘‘మూడో టీ20లో విజయం సాధించి, భారత్ సిరీస్‌పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. స్వదేశంలో టీమిండియా అంత సులువుగా ఓడిపోదు. కాబట్టి.. ఇప్పుడు ఒత్తిడి ఉన్నది భారత్‌పై కాదు, దక్షిణాఫ్రికాపై! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోయినా.. పోరాట పటిమ ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లని అభినందించాల్సిందే! హర్షల్ పటేల్, చాహల్ బాగా బౌలింగ్ చేయడంతో.. మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది’’ అని ఇంజమామ్ అన్నాడు.

అంతేకాదు.. తొలుత ఈ సిరీస్‌ని దక్షిణాఫ్రికా కౌవసం చేసుకుంటుందని అనిపించిందని, దాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపాడు. ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని, అది చూడ్డానికి కనులవిందుగా ఉందన్నాడు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని, యంగ్‌స్టర్స్‌తో ఎలా ఉండాలో అతనికి తెలుసని, అండర్-19 ఫార్ములానే ఇక్కడా అమలు చేస్తున్నాడని ఇంజమామ్ వివరించాడు.

Show comments