కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా జరగనుండటంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు అందరు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఐపీఎల్ ముగియగానే యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా… ఆ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా… రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ సాంప్రదాయకమైన టెస్ట్ ఫార్మాట్ లో తన కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకోనున్నాడు అని తెలుస్తుంది. రానున్న రోజుల్లో భారత టెస్ట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే కోహ్లీ తర్వాత భారత టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ మరి కొందరు కోహ్లీ వైట్ బాల్ ఫార్మాట్లలో న్యాయకత్వ భాధ్యతల నుండి తప్పుకోనున్నాడు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోనున్న కోహ్లీ..?
