India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India A vs Sri Lanka A: దంబుల్లాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టు సూపర్ ఓవర్లో ఇండియా ‘ఎ’పై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమాన స్కోరు చేయడంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. అయితే సూపర్ ఓవర్లో ఇండియా ‘ఎ’ లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చర్చనీయాంశమైంది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టుకు సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, విప్రజ్ నిగమ్ 51 పరుగులు చేశాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం 21 పరుగులకే పరిమితమయ్యాడు. శ్రీలంక ‘ఎ’ బౌలర్లలో విజయకాంత్ వ్యాసకాంత్, మహమ్మద్ షిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
Also Read
- ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
- IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమ 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అయితే చివరి ఓవర్లో అర్షద్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను గెలుపు దూరంలో నిలిపివేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ‘ఎ’ 16 పరుగులు చేసింది. అనంతరం ఇండియా ‘ఎ’ తరఫున సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు వచ్చారు. అయితే శ్రీలంక బౌలర్ కుగదాస్ మతులన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు 10 పరుగులకే పరిమితమైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇండియా ‘ఎ’ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఓటమి అనంతరం శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, వైభవ్ సూర్యవంశీ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపించాడు. ఈ క్రమంలో ఒక శ్రీలంక ఫీల్డర్‌తో అతడు వాగ్వాదానికి దిగినట్లు మైదానంలో కనిపించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే సహచర ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే జోక్యం చేసుకుని వైభవ్‌ను శాంతింపజేశాడు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఈ సిరీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయినప్పటికీ ప్రత్యర్థి జట్లు అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అతడిని కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగడం అతడి పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. సూపర్ ఓవర్లో ఓటమి, అనంతరం మైదానంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఈ మ్యాచ్‌ను మరింత చర్చనీయాంశంగా మార్చాయి.
తాజావార్తలు
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
-
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
-
Karnataka: మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
-
Jana Sena Five Key Resolutions: ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’.. ఐదు తీర్మానాలకు ఆమోదం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?