Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Six Centuries in One Day: ఈ సండే.. మామూలే సండే కాదు.. సెంచరీల సండే.. ఎందకంటే ఏకంగా ఒకే రోజు 6 శతకాలు నమోదయ్యాయి.. దీంతో, క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 27వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. ఆదివారం జరిగిన మూడు వేర్వేరు వన్డేల్లో బ్యాటర్లు అద్భుతంగా చెలరేగారు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ మొత్తం ఆరు సెంచరీలు నమోదు చేశారు. ఈ శతకాల జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలోనే మూడు శతకాలు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున జస్టిన్ గ్రీవ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 101 పరుగులు సాధించాడు. ఇది అతడి వన్డే కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక, 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుత ఆరంభాన్ని అందించారు. గిల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 110 పరుగులతో శతకం సాధించాడు. మరోవైపు రన్ మిషన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో మరో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 139 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు 8 వికెట్ల ఘన విజయాన్ని అందించాడు.
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
మరోవైపు.. జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు కూడా సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ టెంబా బవుమా 103 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 93 బంతుల్లోనే 142 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బవుమా, మిల్లర్ కలిసి నాలుగో వికెట్‌కు 156 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 365 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక, ది ఓవల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ టామ్ బాంటన్ తన సత్తా చాటాడు. అతడు మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తూ 126 పరుగులు చేసి తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్‌తో కలిసి బాంటన్ 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రూక్ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా సెప్టెంబర్ 27న జరిగిన మూడు వన్డేల్లో మొత్తం ఆరు శతకాలు నమోదయ్యాయి. గిల్ 110, కోహ్లీ 139 నాటౌట్, గ్రీవ్స్ 101, బవుమా 103, మిల్లర్ 142 నాటౌట్, బాంటన్ 126 పరుగులతో సెంచరీల పండుగను కొనసాగించారు. అయితే వీరిలో కోహ్లీ అజేయ 139 పరుగుల ఇన్నింగ్స్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.. కింగ్ కోహ్లీ షాట్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు..
తాజావార్తలు
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!