Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma and Virat Kohli: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇద్దరూ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఆరంభం నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసిన రోహిత్‌ను సామ్ కరన్ ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రోహిత్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కేవలం 5 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అంతకుముందు ఇంగ్లండ్ 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో జట్టును ఆదుకోగా, అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించాడు. ఇక, 30 ఓవర్లు పూర్తి అయ్యే సరిక భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరగులు చేసింది.. అయితే, మంచి ఇన్సింగ్స్ ఆడిన కెప్టెన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ కాగా.. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి రనౌట్ అయ్యారు.. కేఎల్ రాహుల్ ఒక పరుగు మాత్రమే చేశాడు..
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!