Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్‌లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ స్లిప్‌లో నిలబడి వరుసగా మూడు క్యాచ్‌లు పట్టి తన చురుకుదనాన్ని మరోసారి నిరూపించాడు. రోహిత్ ప్రదర్శనతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్‌ను పూర్తిగా కుదేలు చేసింది.
ప్రసిద్ధ్ బౌలింగ్‌కు రోహిత్ అద్భుత సహకారం
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రసిద్ధ్ కృష్ణ తన పదునైన బౌలింగ్‌తో ఒత్తిడి సృష్టించాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని రహ్మానుల్లా గుర్బాజ్ ఎడ్జ్ చేయగా, ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది.
Also Read
- PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
వరుసగా మూడు క్యాచ్‌లతో ఆకట్టుకున్న హిట్‌మ్యాన్
గుర్బాజ్ ఔటైన కొద్దిసేపటికే రహ్మత్ షా కూడా ప్రసిద్ధ్ కృష్ణ బంతిని ఎడ్జ్ చేశాడు. మరోసారి సరైన స్థానంలో ఉన్న రోహిత్ క్యాచ్ అందుకుని భారత్‌కు రెండో వికెట్ అందించాడు. అనంతరం ఇబ్రహీం జద్రాన్ కూడా ప్రసిద్ధ్ బౌలింగ్‌కు చిక్కగా, స్లిప్‌లో ఉన్న రోహిత్ వరుసగా మూడో క్యాచ్ పట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
పవర్‌ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ దెబ్బ
టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ కోలుకోలేకపోయింది. యువ బ్యాట్స్‌మన్ దర్విష్ రసూలీని శ్రేయాస్ అయ్యర్ చేత క్యాచ్ పట్టించి ప్రసిద్ధ్ కృష్ణ తన నాలుగో వికెట్ సాధించాడు. దీంతో పవర్‌ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
చరిత్రలో చోటు సంపాదించిన ప్రసిద్ధ్ కృష్ణ
ఈ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో చేరాడు. గతంలో మహమ్మద్ సిరాజ్, జవగల్ శ్రీనాథ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు ఈ ఘనతను నమోదు చేశారు.
భారత్ ఆధిపత్యానికి నాంది
రోహిత్ శర్మ పట్టిన మూడు అద్భుతమైన క్యాచ్‌లు, ప్రసిద్ధ్ కృష్ణ విధ్వంసకర బౌలింగ్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశాయి. ఈ జోడీ ప్రదర్శనతో మ్యాచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి విజయానికి బలమైన పునాది వేసుకుంది.
వన్డేలలో మొదటి 10 ఓవర్లలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు (భారత బౌలర్లు)
* 5 మహమ్మద్ సిరాజ్ vs శ్రీలంక, కొలంబో 2023
* 4 జవగల్ శ్రీనాథ్ vs శ్రీలంక, జోహన్నెస్‌బర్గ్ 2003
* 4 భువనేశ్వర్ vs శ్రీలంక, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2013
* 4 జస్ప్రీత్ బుమ్రా vs ఇంగ్లాండ్, ది ఓవల్ 2022
* 4 మహమ్మద్ సిరాజ్ vs శ్రీలంక, తిరువనంతపురం 2023
* 4 అర్ష్‌దీప్ సింగ్ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్ 2023
* 4 ప్రసిద్ధ్ కృష్ణ vs ఆఫ్ఘనిస్తాన్, చెన్నై 2026
తాజావార్తలు
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!