NTV Telugu Site icon

పతకం కోసం ఐదేళ్లు కుటుంబానికి దూరంగా మీరా బాయి చాను

ఒలింపిక్స్‌ విజేత మీరా బాయి చాను…ప్రాక్టీస్‌ కోసం కుటుంబసభ్యులకు దూరంగా ఉంది. ఇంట్లో ఉంటే శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి…తల్లిదండ్రులను కలుసుకునేది కాదు. నిరంతరం కఠోరంగా శిక్షణ తీసుకోవడం వల్లే విశ్వక్రీడల్లో పతకం వచ్చేలా చేసింది. కొవిడ్‌ వైరస్‌ విజృంభణతో గతేడాది విధించిన లాక్‌డౌన్‌ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది చాను. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసేవని వెల్లడించింది. లాక్‌డౌన్‌ తర్వాత ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేయడంతో…వీపు భాగం పట్టేసేదని…కుడి భుజానికి సమస్య వచ్చినట్లు తెలిపింది. ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కండరాలు పట్టేసేవని చెప్పింది. భుజం సమస్య వల్ల స్నాచ్‌ సరిగా చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది.

భుజం నొప్పి గాయం కారణంగా….అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంది మీరాబాయి. మాజీ వెయిట్‌ లిఫ్టర్‌, ఫిజియో థెరపిస్టు, డాక్టర్‌ ఆరోన్‌ హార్స్‌చిగ్‌ వద్దకు వెళ్లడం లాభం చేకూర్చిందని చాను తెలిపింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. కండరాల మధ్య సమతూకం లేదని…అందుకే, బరువులు ఎత్తగానే నొప్పి వచ్చేదని చెప్పింది. డాక్టర్‌ సూచించిన కొన్ని కసరత్తులు…ఉపయోగపడ్డాయని చాను వెల్లడించింది. ఐదేళ్లలో ఇంటి వద్ద గడిపింది పది రోజులేననీ, ఇప్పుడూ ఇంటి వద్ద ఎక్కువ రోజులేం ఉండనని పేర్కొంది. పది రోజులు ఉండి కామన్వెల్త్‌ అర్హత పోటీలకు సిద్ధమవుతానని వెల్లడించింది. తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది.