IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI 5th T20: వెస్టిండీస్‌తో ఇప్పటికే నాలుగు టీ-20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 2-2 సమంగా ఉంది.. ఇక, ఐదోది అయిన తుది టీ-20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను భారత జట్టులోకి చేర్చారు. అయితే, అర్ష్‌దీప్ ఐదో టీ20లో ఆడతాడా లేదా అన్నది మ్యాచ్‌కు ముందు అతడి ఫిట్నెస్ను బట్టి నిర్ణయించనున్నారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత పునరాగమనానికి అవకాశం
36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన భువనేశ్వర్‌కు, వెస్టిండీస్‌తో బెంగళూరులో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లభించింది. తుది జట్టులో చోటు దక్కితే దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
అర్ష్‌దీప్ ఫిట్‌నెస్‌పైనే నిర్ణయం
హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ భుజానికి గాయమైంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతడు భారత బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించాడు. అతడి గాయం కారణంగా చివరి మ్యాచ్‌లో బౌలింగ్ విభాగాన్ని ఎలా సిద్ధం చేయాలనే దానిపై జట్టు యాజమాన్యం దృష్టి సారించింది. అర్ష్‌దీప్ కోలుకుంటే అతడి భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.
సిరీస్ సమం.. బెంగళూరులో నిర్ణయాత్మక పోరు
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. ఇరు జట్లు చెరో రెండు విజయాలు సాధించడంతో ఐదో మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. అక్టోబర్ 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
భారత్ సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్
అర్ష్‌దీప్ సింగ్ ఫిట్నెస్ను బట్టి భారత తుది జట్టులో మార్పులు ఉండవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లేదా భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే, ఇది అంచనా మాత్రమే.. ఇది, అధికారిక ప్లేయింగ్ ఎలెవన్ కాదు.
న్యూజిలాండ్ సిరీస్‌కూ భువనేశ్వర్ ఎంపిక
మరోవైపు.. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టులోనూ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20లో ఆడే అవకాశం లభిస్తే, తదుపరి సిరీస్‌కు ముందు అంతర్జాతీయ మ్యాచ్ ప్రాక్టీస్ పొందే వీలుంటుంది. ప్రస్తుతం అభిమానుల దృష్టి అర్ష్‌దీప్ కోలుకోవడం, భువనేశ్వర్ పునరాగమనం, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు కూర్పుపైనే ఉంది.. మరి తుది జట్టులో చోటు దక్కేది ఎవరికో వేచి చూడాలి..
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!