IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 2nd Test: శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌పై గురిపెట్టింది.. రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడి అజేయ 115 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు 300/5తో ముగించిన భారత్‌కు రెండో రోజు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కీలకంగా నిలిచారు. ఏడో వికెట్‌కు ఇద్దరూ కలిసి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 63 పరుగులతో రాణించాడు. అనంతరం జురెల్ దిగువ వరుస బ్యాటర్లతో కలిసి భారత్ స్కోర్‌ను 500 మార్క్ దాటించాడు.
ధ్రువ్ జురెల్ తన టెస్టు కెరీర్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జురెల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. విదేశీ గడ్డపై జురెల్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 117 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 63, యశస్వి జైస్వాల్ 45, రవీంద్ర జడేజా 43 పరుగులతో కీలక సహకారం అందించారు. రెండో రోజు ఆటలో సారంశ్ జైన్ 6 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్.. జురెల్‌తో కలిసి భారత్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. పంత్ ఔటైన తర్వాత మానవ్ సుతార్ 18 పరుగులు చేయగా, చివర్లో జురెల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్‌కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులోనూ భారీ స్కోర్ సాధించడంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో భారత జట్టు ముందుకు సాగుతోంది. తాజా స్కోర్ ప్రకారం భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్‌కు శ్రీలంకపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 47 టెస్టుల్లో తలపడగా భారత్ 23 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక 7 విజయాలు సాధించగా, 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
తాజావార్తలు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!