Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cristiano Ronaldo Retirement: ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. కానీ, కొందరే లెజెండ్స్‌గా మారుతారు.. చరిత్రపై తమ పేరును చిరస్థాయిగా రాసుకుంటారు.. అలాంటి ఆటగాళ్లలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఒకరు.. అయితే, అంతర్జాతీయ ఫుట్‌బాల్ లో ఓ శకం ముగియనుంది. పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ అంతర్జాతీయ మ్యాచ్‌ల విరామం తర్వాత పోర్చుగల్ జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు ప్రకటించారు. 41 ఏళ్ల రొనాల్డో తన 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో అద్భుత రికార్డులు సృష్టించారు. పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించారు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్రలో నిలిచారు.
23 ఏళ్ల ప్రయాణం.. 146 గోల్స్.. ఎన్నో చారిత్రక రికార్డులు
రొనాల్డో 2003లో తన 18 ఏళ్ల వయసులో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారారు. అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును ఎన్నో విజయాల వైపు నడిపించారు. 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించారు. ఇక, పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రొనాల్డో కొనసాగుతున్నారు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించారు. 2006, 2010, 2014, 2018, 2022, 2026 ఫిఫా ప్రపంచకప్‌లలో పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన కెరీర్లో అత్యంత గొప్ప విజయాల్లో 2016 యూరో కప్ ఒకటి. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఆతిథ్య జట్టును 1-0తో ఓడించి పోర్చుగల్ తొలిసారి యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచింది. గాయం కారణంగా రొనాల్డో ఫైనల్ మ్యాచ్‌ను పూర్తిగా ఆడలేకపోయినా కెప్టెన్‌గా జట్టుకు అందించిన ప్రోత్సాహం, నాయకత్వం ఎంతో కీలకంగా నిలిచాయి. ఆ తర్వాత 2019, 2025లో యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లను కూడా పోర్చుగల్ గెలుచుకుంది.
Also Read
- PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
- Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
- PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు.. భావోద్వేగ వీడియో సందేశం
సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశం ద్వారా రొనాల్డో తన నిర్ణయాన్ని వెల్లడించారు. పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున ధరించిన నంబర్ 7 జెర్సీని తిరిగి అప్పగించే సమయం వచ్చిందని భావోద్వేగంగా తెలిపారు. 23 ఏళ్ల పాటు ఈ జెర్సీని ధరించడం తనకు ఎంతో గర్వకారణమని, అదే సమయంలో గొప్ప బాధ్యతగా భావించానని చెప్పారు. ఆ జెర్సీ ఎప్పుడూ తనకు మాత్రమే చెందినది కాదని, అది పోర్చుగల్ ప్రజల గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఇన్నేళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన ప్రత్యేక గౌరవమని తెలిపారు. ఇప్పుడు ఆ బాధ్యతను తదుపరి తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని రొనాల్డో స్పష్టం చేశారు. పోర్చుగల్ ఎప్పటికీ తన హృదయంలో ఉంటుందని భావోద్వేగ సందేశం ఇచ్చారు. నవంబర్ అంతర్జాతీయ మ్యాచ్‌ల విరామం తర్వాత జాతీయ జట్టుకు వీడ్కోలు పలకనున్నారు.
కోచ్ జార్జ్ జీసస్‌తో విభేదాల నేపథ్యంలో నిర్ణయం
రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించిన సమయంలో పోర్చుగల్ జట్టు ప్రధాన కోచ్ జార్జ్ జీసస్‌తో ఆయనకు ఏర్పడిన విభేదాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 27న నార్వేలో జరిగిన నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1తో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో రొనాల్డోకు మైదానంలో ఆడే అవకాశం లభించలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే రొనాల్డో డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. సహచర ఆటగాళ్లతో కలిసి ప్రేక్షకులకు అభివాదం చేయకపోవడం కూడా చర్చకు దారితీసింది. అనంతరం పోర్చుగల్ జట్టు శిక్షణ శిబిరాన్ని విడిచిపెట్టడంతో ఆయన అంతర్జాతీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
కోచ్ మాట తప్పారంటూ రొనాల్డో ఆరోపణలు
శిక్షణ శిబిరం నుంచి వెళ్లిపోయిన అనంతరం రొనాల్డో సుమారు 2,000 పదాలతో కూడిన సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. నార్వేతో మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా తనను మైదానంలోకి పంపిస్తానని కోచ్ జార్జ్ జీసస్ హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే తాను వార్మప్ కూడా ప్రారంభించానని తెలిపారు. అయితే చివరి నిమిషంలో కోచ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఒకలా, మీడియా సమావేశంలో మరోలా మాట్లాడారని రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తన నమ్మకాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. మరోవైపు రొనాల్డోను వార్మప్ చేయించి చివరకు మైదానంలోకి పంపకపోవడం తన తప్పేనని కోచ్ జార్జ్ జీసస్ కూడా అంగీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య రొనాల్డోపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 30 రోజుల నిషేధంతో పాటు జరిమానా విధించింది. తన ప్రవర్తనకు అభిమానులకు క్షమాపణలు చెప్పిన రొనాల్డో, శిక్షను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.
క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్న CR7
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు పలుకుతున్నప్పటికీ, ఫుట్‌బాల్‌కు పూర్తిగా దూరం కావడం లేదు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్ తరఫున క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నారు. తన కెరీర్లో 1,000 గోల్స్ మైలురాయిని చేరుకోవాలన్న లక్ష్యం కూడా ఆయన ముందుంది. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ శకం ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప కాలంగా గుర్తుండిపోతుంది. తన అద్భుతమైన ఆటతీరు, గోల్స్, రికార్డులు, నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డో.. పోర్చుగల్ జాతీయ జట్టుకు 146 గోల్స్, 234 మ్యాచ్‌లు, మూడు ప్రధాన అంతర్జాతీయ టైటిళ్లతో వీడ్కోలు పలకనున్నారు.
View this post on Instagram
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
-
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!