న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా అదరగొడుతోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో కొద్దిలో ఓటమి తప్పించుకుని బతికిపోయిన రోహిత్‌సేన..రెండో మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండర్ షో చూపెట్టింది. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టింది. దీంతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు క్లీన్‌స్వీప్‌పై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే నేడు (మంగళవారం) ఇండోర్‌లో జరిగే మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ జట్టులో పలు మార్పులు చేసింది మేనేజ్‌మెంట్. షమీ, సిరాజ్ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్, చాహల్‌కు అవకాశం లభించింది. కివీస్ కూడా జట్టులో ఓ మార్పు చేసింది. షిప్లే ప్లేస్‌లో జాకబ్ డఫ్ఫీకి చోటు కల్పించింది.
బ్యాటింగ్ పరంగా భారత్‌కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే మిడిలార్డర్‌లోని ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సత్తా చూపించడం లేదు. ఓపెనర్లు లేదా వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ చెలరేగితేనే భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ ఏం చేస్తుందో ఇటీవల పెద్దగా కనిపించలేదు. శ్రీలంకపై రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరి మూడో వన్డేలో ఏం చేస్తాడో చూడాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, శార్దూల్, కుల్దీప్, చాహల్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, కాన్వే, నికోలస్, డారైల్ మిచెల్, లాథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, ఫెర్గుసన్, జాకబ్ డఫ్పీ, టిక్నెర్
🚨 Toss Update 🚨
New Zealand win the toss and elect to field first in the third #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#TeamIndia | @mastercardindia pic.twitter.com/S1V3NmNnmp
— BCCI (@BCCI) January 24, 2023