Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!

  • టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు
  • నమీబియాపై భారత్ అతిపెద్ద విజయం
  • కేవలం గెలవడం కాదు ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం
Team India Biggest Defeats

Team India Biggest Defeats

Team India T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ విజయాలు టీమ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ప్రత్యర్థులను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టుతూ భారత్ సాధించిన ఈ విజయాలు టోర్నమెంట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం నమీబియాపై నమోదు చేసింది. 2026లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కే కాకుండా మొత్తం టోర్నమెంట్ చరిత్రలోనే అద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.

2012లో ఇంగ్లాండ్‌పై 90 పరుగుల తేడాతో సాధించిన విజయం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఆ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ మంచి ప్రదర్శనతో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేసింది. మూడో స్థానంలో 2014లో ఆస్ట్రేలియాపై 73 పరుగుల భారీ గెలుపు ఉంది. ఈ మ్యాచ్ మిర్పూర్‌లో జరిగింది. 2022లో మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 2024 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి భారీ విజయం సాధించడం భారత్ స్థిరత్వాన్ని, పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

Also Read: Team India History: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో టాప్ టీమ్!

మొత్తం చూస్తే.. ఈ రికార్డులు భారత్ టీ20 ఫార్మాట్‌లో ఎంత బలమైన జట్టో చూపిస్తున్నాయి. భారీ మార్జిన్ విజయాలు సాధించడం అంటే కేవలం గెలవడం కాదు, ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడం. భారత్ ఆ విషయంలో ప్రపంచ క్రికెట్‌కు మళ్లీ మళ్లీ తన సత్తా నిరూపిస్తోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌ 2026 జరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. అమెరికా, నమీబియాపై భారత్ గెలిచింది. ఇక ఫ్రిబ్రవరి 15న దాయాది పాకిస్థాన్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.