NTV Telugu Site icon

Weight Lifting: భారత్‌కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు

Weight

Weight

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తా చాటారు. మెక్సికో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంక్ష కిషోర్‌, విజయ్‌ ప్రజాపతి రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆకాంక్ష.. స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తి.. మొత్తం మీద 127 కేజీలు లిఫ్ట్‌ చేసి రెండో స్థానంలో నిలిచింది.

49 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 97 కేజీలు లిఫ్ట్‌ చేసిన విజయ్‌.. ఓవరాల్‌గా 175 కేజీలు ఎత్తి రెండో స్థానం సాధించాడు. ఔరాంగాబాద్‌లోని సాయ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఆకాంక్ష శిక్షణ పొందుతుండగా.. పటియాలలోని ఎన్‌సీఓఈలో విజయ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. పోటీల తొలి రోజు శనివారం కూడా భారత లిఫ్టర్లు రెండు రజత పతకాలు చేజిక్కించుకోవడంతో.. మన ఖాతాలో మొత్తం 4 పతకాలు చేరాయి.