NTV Telugu Site icon

Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్

Imran Nazir

Imran Nazir

Indian Fans Fire On Imran Nazir For Controversial Comments: ఆసియా కప్ వేదిక వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే! పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే ఆ గడ్డపై భారత్ కాలు మోపదని బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యానించగా.. తాము కూడా వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టమంటూ పాక్ బోర్డు తిరుగు సమాధానం ఇచ్చింది. ఇప్పటికీ ఈ విషయంపై ఇరు దేశాల మాజీలు, ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు గాను ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ పాక్‌లోనే నిర్వహించేందుకు అంగీకరించిన ఐసీసీ.. భారత్‌కి సంబంధించిన మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించేలా ప్రణాళికలు రచించినట్టు తెలిసింది.

Mallikarjun Kharge: ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.. రాహుల్‌ కోసం పోరాడుతాం..

ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ‘‘భద్రతా కారణాలనేవి కేవలం ఒక సాకు మాత్రమే. పాకిస్తాన్‌కి ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లు కూడా వచ్చాయి. కానీ టీమిండియా మాత్రం పాక్‌కు రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్‌ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే.. వాళ్లు ఇక్కడికి రావడం లేదు. దమ్ముంటే పాకిస్తాన్‌కి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడే ఎవరి సత్తా ఏంటో అన్నీ తెలుస్తాయి’’ అంటూ ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే సాధారణంగానే అంచనాలు ఏర్పడుతాయని, కానీ భారత జట్టుకి ఓటమిని తట్టుకునే శక్తి ఉండదని, అందుకే భద్రతా కారణాల్ని చూపిస్తూ ఇక్కడికి రాలేమంటూ సాకులు చెప్తున్నారని పేర్కొన్నాడు.

Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు

ఈ విధంగా ఇమ్రాన్ వ్యాఖ్యానించడంతో.. అతనిపై ఇండియన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పాక్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసని.. గతంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు అప్పటికప్పుడే తమ సిరీస్‌లు రద్దు చేసుకున్నారని.. ఆ విషయం గుర్తు లేదా? అంటూ ధ్వజమెత్తారు. ఎంతో పటిష్టమైన టీమిండియా లాంటి జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు.. ఆలోచించుకుంటే మంచిదని హెచ్చరించారు. భారత్‌ని ఓడించేంత స్థాయి పాక్‌కి లేదని, ముందు మీ స్థాయి ఏంటో మర్చిపోవద్దంటూ కౌంటర్లు వేశారు.