Site icon NTV Telugu

IND Vs AUS: ఉప్పల్‌లో డిసైడర్ మ్యాచ్.. టాస్ గెలిచిన టీమిండియా

Toss 1

Toss 1

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలివచ్చారు. ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగ్‌ల‌ను ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసుల గుర్తించారు.

తుది జట్ల వివరాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బూమ్రా, చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్ (కెప్టెన్), గ్రీన్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, జోస్ ఇంగ్లీస్, టిమ్ డేవిడ్, మథ్యూ వేడ్, కమ్మిన్స్, డానియల్ శామ్స్, ఆడం జంపా, హేజిల్‌వుడ్

 

Exit mobile version