Site icon NTV Telugu

India vs England : పంత్‌ పోరాటం.. సిరీస్‌ టీమిండియా కైవసం

Rishabh Pant

Rishabh Pant

India Won The Series With England.
ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌-టీమిండియాల మధ్య జరిగి చివరి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్-టీమిండియా మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 1-1గా సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిన్న పోటీ పడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌ పంత్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో మరో 47 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ సిరీస్‌ను సాధించింది.

260 పరుగుల లక్ష్యంతో దిగిన భారత జట్టు 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. పంత్‌ స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు లతో 125 పరుగులు సాధించి క్రీజులోనే ఉన్నాడు. అయితే పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు పంత్‌. ఇదిలా ఉంటే.. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్‌లో వరుసగా పంత్‌ 5 ఫోర్లు కొట్టడం కొసమెరుపు

Exit mobile version