Site icon NTV Telugu

చారిత్రక వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ దుమ్మురేపింది. 177 పరుగుల విజయలక్ష్యాన్ని 28 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియాకు వన్డేల్లో ఇది 1000వ వన్డే కావడంతో ఈ మ్యాచ్‌ను మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది.

Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్ 176 పరుగులకు ఆలౌటైంది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ (60), ఇషాన్ కిషన్ (28) రాణించారు. విరాట్ కోహ్లీ 8 పరుగులకే అవుటయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ కూడా 11 పరుగులకే రనౌటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), దీపక్ హుడా (26 నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.

Exit mobile version