అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. భువనేశ్వర్ 3 వికెట్లతో ఇంగ్లండ్ జట్టను గట్టి దెబ్బ కొట్టాడు. మిగతా బౌలర్లలో బుమ్రా, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. హర్షల్ పటేల్, హార్డిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. కాగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది.
Read Also: Kapil Dev: కోహ్లీకి కూడా అశ్విన్ లాంటి పరిస్థితే వస్తుంది
