Site icon NTV Telugu

IND vs WI: టీ20 సిరీస్‌‌ కూడా ఊడ్చేశారు

కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) మంచి స్కోరు అందించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది.

భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీశారు. నికోలస్ పూరన్ (65) మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడినా విండీస్‌కు ఓటమి తప్పలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్విప్ చేసింది. వెస్టిండీస్‌తోనే జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version