Site icon NTV Telugu

Womens World Cup: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

టీమిండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి చావుదెబ్బ తింది. వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో పాటు అగ్రస్థానం సంపాదించింది.

భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసింది. స్నేహ రాణా, ఝులన్ గోస్వామిలు తలో రెండు వికెట్లు కూల్చారు. మేఘనా సింగ్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ సాధించారు. టీమిండియా బ్యాటింగ్‌లో 8 ఫోర్ల సాయంతో 59 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పూజా వత్సాకర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ముఖ్యంగా స్నేహ్ రానా, పూజా వత్సాకర్ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

Exit mobile version