Site icon NTV Telugu

Asia Cup 2022: ఆసియా కప్ ఎక్కువ సార్లు ఎవరు గెలిచారో తెలుసా?

Asia Cup 2022

Asia Cup 2022

Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్‌ వేదికగా ఆసియాకప్ 2022 జరగనుంది. ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక వంటి జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు కూడా పాల్గొంటాయి. ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్‌ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్‌ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి వన్డే ఫార్మాట్ లో ఆసియాకప్‌ జరిగిన సమయంలోనూ ఇండియానే గెలిచింది. ఈ ఏడాది మరోసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగబోతోంది. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరుగుతుండటంతో నిర్వాహకులు ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకూ ఆసియాకప్‌లో భాగంగా 14 టోర్నీలు జరిగాయి. అందులో 7 సార్లు ఇండియానే టైటిల్ సొంతం చేసుకుంది. చివరి రెండుసార్లు కూడా ఇండియానే విజేతగా నిలిచింది. అటు చివరిగా జరిగిన రెండు టోర్నీల్లో రన్నరప్ బంగ్లాదేశ్ కావడం గమనార్హం. 2012 నుంచి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ మూడుసార్లు ఫైనల్‌ రావడం విశేషం. ఆసియాకప్ చరిత్రలో ఇండియా తర్వాత శ్రీలంక ఐదుసార్లు గెలిచి రెండోస్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌ రెండుసార్లు మాత్రమే ఆసియాకప్‌ విజేతగా నిలిచింది.

Exit mobile version