NTV Telugu Site icon

IND vs SL 3rd T20I: శ్రీలంకపై ఘనవిజయం.. భారత్‌దే టీ20 సిరీస్

India Won Match

India Won Match

India Won 3rd T20I Match Against Sri Lanka: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన భారీ లక్ష్యంతో (229) బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, బౌలింగ్‌లో బౌలర్లందరూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం వల్లే.. భారత్ ఈ ఘనవిజయాన్ని సాధించగలిగింది. ఫలితంగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది.

Suryakumar Yadav: సూర్యకుమార్ అదిరిపోయే రికార్డు.. టీ20 హిస్టరీలోనే తొలి ఆటగాడు

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నిజానికి.. బరిలోకి దిగిన వెంటనే భారత్‌కి గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే 3 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (35) కాసేపు లంక బౌలర్లకి చుక్కలు చూపించారు. శుబ్మన్ గిల్‌తో కలిసి 49 భాగస్వామ్యాన్ని జోడించాడు. రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే తాండవం చేశాడు. వీడియో గేమ్ తరహాలోనే ఇతడు 360 డిగ్రీ ఆటతో పరుగుల వర్షం కురిపించాడు. శ్రీలంక బౌలర్లు ఔట్ చేసేందుకు ఎంతటి క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల మీద బౌండరీలు బాదేశాడు. దీంతో అతడు 51 బంతుల్లోనే 9 సిక్స్‌లు, 7 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ (21) కూడా రప్ఫాడించడంతో.. భారత్ 228 పరుగులు చేయగలిగింది.

Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?

ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. మొదట్లో చితక్కొట్టేసింది. మన భారత బౌలర్లు కూడా ఉచితంగా పరుగులు సమర్పించుకోవడంతో, శ్రీలంక స్కోర్ బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే.. ఆ తర్వాత భారత బౌలర్లు తిరిగి గాడిలోకి వచ్చి, కట్టడి చేశారు. లంక బ్యాటర్లకు పరుగులు కొట్టే అవకాశం ఇవ్వకుండా, వరుసగా వికెట్లు తీశారు. దీంతో.. 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంకలో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. బౌలర్ల విషయానికొస్తే.. అర్ష్‌దీప్ 3 వికెట్లు తీయగా, ఉమ్రాన్, చాహల్, పాండ్యా చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.