Commonwealth Games 2022: అదరగొట్టిన భారత్.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్‌వెల్త్ గేమ్స్ చివరిదశకు చేరిన వేళ భారత ఆటగాళ్లు అదరగొట్టారు. భారత బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయారు. ఒకే రోజు బాక్సింగ్‌లో మూడు స్వర్ణాలను భారత్ గెలుచుకుంది. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 48-50 కేజీల విభాగంలో నార్తన్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇక, పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్ పంగల్, మహిళల మినిమమ్ వెయిట్‌లో నితూ గంఘాస్ కూడా బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆచంట శరత్ కమల్-శ్రీజ ఆకుల జోడీ సత్తా చాటింది. ఫైనల్‌లో 3-1తో మలేషియాకు చెందిన జావెన్-కరెన్ లైన్‌ను ఓడించి స్వర్ణం సాధించారు.
Read Also: CWG 2022: ఆసీస్ చేతిలో భారత్ ఓటమి.. చేజారిన పసిడి..
Also Read
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- RCB Player: అభిమానులకు బిగ్‌షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. ఎల్దోస్ పాల్ 17.03మీటర్లు దూకి గోల్డ్ సాధించాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. మరోవైపు అబ్దుల్లా అబూబకర్ 17.02 మీటర్లు దూకి సిల్వర్ మెడల్ సాధించాడు. అటు 10వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ సందీప్ కుమార్ సత్తా చాటి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. మహిళల జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం కైవసం చేసుకుంది.
ఇక బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. ఉమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్‌కు చేరారు. ఇవాళ ఇద్దరూ ఫైనల్ ఆడబోతున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. సింగపూర్ ఆటగాడు జియాహెంగ్ పై గెలిచి కాంస్యం దక్కించుకున్నాడు. కామన్వెల్త్‌లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్ నుంచి పసిడి చేజారింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. మొత్తంగా.. కామన్వెల్త్‌లో భారత్ 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. నేటితో కామెన్‌వెల్త్ గేమ్స్ ముగియనున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!