India vs South Africa: నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా ఈ రోజు మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జరగబోతోంది. ఇండియా, సౌతాఫ్రికాలు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని అంతా భావిస్తున్నారు. భారత్ కప్ గెలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. భారత్ సెమీ ఫైనల్‌లో 7 సార్లు ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించగా, దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు వచ్చింది. ఇరు జట్లలోని హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్జ్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, లారా వోల్వార్డ్ట్ మంచి ఫామ్ లో ఉన్నారు. వీరి ఆట తీరుపైనే ఇరు జట్ల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వానగండం ఉంది. అక్యూవెదర్ ప్రకారం, మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ రోజున నవీ ముంబైలో వర్షం పడే అవకాశం 63 శాతం ఉందని, ఉరుములతో కూడి వర్షం పడే అవకాశం దాదాపు 13 శాతం ఉందని చెప్పింది. అడపాదడపా వర్షం మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.
Read Also: Jogi Ramesh PA: జోగి రమేష్ పీఏను వదిలి పెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?
వర్షంతో మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి..?
ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, నిర్వాహకులు అలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. నవంబర్ 03 అంటే సోమవారం రిజర్వ్ డేగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం తేలడానికి ఇరు జట్లకు కనీసం 20 ఓవర్లు అవసరం. వర్షం వల్ల మ్యాచ్ రిజర్వ్ డేకు మారితే, ఆ రోజు కూడా వర్షం పడితే భారత్, దక్షిణాఫ్రికాలు ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.
