India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు మరో గండం..

  • భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు మరో గండం..
  • కోలంబోలో ఆదివారం వర్షం పడే అవకాశం..
Ind Vs Pak

Ind Vs Pak

India Vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ వరల్డ్ ఎదురుచూస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడబోతున్నారు. మొత్తం టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలువనుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురుచూస్తు్న్నారు. భారత ఫ్యాన్స్ మరోసారి పాకిస్తాన్‌పై ఆధితప్యం చూపించాలని కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిపై ఉన్న రికార్డును కొనసాగించాలని ఆశిస్తున్నారు.

Read Also: NEET-Based Nursing Admissions: నీట్‌ ఆధారంగా నర్సింగ్‌ ప్రవేశాలు.. సీఎం ఆమోదం…

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. Accuweather.com ప్రకారం, ఆదివారం కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగటిపూట వర్షం పడే అవకాశం 93 శాతం, ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం 26 శాతం ఉందని తెలిపింది. మొత్తం సుమారు 12.1 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. పాకిస్తాన్ బాయ్‌కాట్ నిర్ణయం తర్వాత యూ-టర్న్ తీసుకోవడంతో భారత్‌తో మ్యాచ్‌ మార్గం సుగమం అయింది. అన్ని అడ్డంకులు, వివాదాలు దాటిన తర్వాత వరణుడు అడ్డుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.