Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!

  • ఐర్లాండ్ పర్యటనలో భారత్ మరో ఓటమి
  • రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి
  • ద్వైపాక్షిక సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి
India One Run Defeat

India One Run Defeat

India Suffers Third One-Run Defeat in T20I History: ఐర్లాండ్ పర్యటనలో భారత్ మరో ఓటమిని చవిచూసింది. ఆదివారం బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసి.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్ తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా ద్వైపాక్షిక సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు 2012లో చెన్నై వేదికగా న్యూజిలాండ్ చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత 2016లో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్ కూడా భారత్‌ను ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఐర్లాండ్ కూడా టీమిండియాకు షాక్ ఇచ్చింది.

టీ20ల్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓడిన మ్యాచ్‌లు
2012 – న్యూజిలాండ్‌పై, చెన్నై
2016 – వెస్టిండీస్‌పై, లాడర్‌హిల్
2026 – ఐర్లాండ్‌పై, బెల్‌ఫాస్ట్