Site icon NTV Telugu

England vs India : సిరీస్‌ మనదే.. క్లీన్‌ స్వీప్‌ చేస్తారా..

India Vs England

India Vs England

టీమిండియా-ఇంగ్లాండ్‌ల మధ్య మూడ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి, రెండవ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే 2-0తో సిరీస్‌ భారత్‌కు ఖరారైనా.. నేడు మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టీమిండియా జట్లు ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌-టీమిండియా రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దీనికి ప్రతీకారం టీమిండియా సైతం ఈ టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 49 పరుగుల ఆధిక్యంతో ఆతిథ్య జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌ లక్ష్యఛేదనలో 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది.

 

Exit mobile version