NTV Telugu Site icon

IND vs SL: బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా విక్టరీ.. సిరీస్‌ కైవసం

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు.. టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు కుప్పకూలింది.. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్‌ కరుణరత్నే సెంచరీతో మెరవగా.. జట్టును గెలిపించలేకపోయారు.. ఇక భారత బౌలర్లలో అశ్విన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇక, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే పెవిలియన్‌ చేరింది.. 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది టీమిండియా.. దీంతో శ్రీలంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది.. లక్ష చేధనలో తడబడిన శ్రీలంక జట్టు.. 252 పరుగులకే వెనుదిరిగింది.