Site icon NTV Telugu

IND Vs WI: కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా.. మూడు వన్డేలకు జట్టు ప్రకటన

Shikar Dhawan

Shikar Dhawan

ఈనెల 22 నుంచి టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొంటుంది. ఈ పర్యటనకు తాజాగా టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పి్ంచారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను బీసీసీఐ రొటేటింగ్ చేస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. ఈ సిరీస్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌ను కెప్టెన్‌గా, ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ప్రకటించారు. అటు జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు.

మూడు వన్డేలకు భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌

ఇదీ షెడ్యూల్:
జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తొలి వన్డే
జూలై 24న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో వన్డే
జూలై 27న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడో వన్డే

Exit mobile version