Thomas Cup: విజేతగా భారత్.. కోనసీమలో మిన్నంటిన సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ ‘థామస్ కప్’ గెలిచి చరిత్ర సృష్టించడంతో.. అమలాపురంలో సంబరాలు మిన్నంటాయి. ఈ విజయం సాధించిన భారత టీమ్‌లో అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఉండడంతో.. అమలాపురం పట్టణంలో అభిమానులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విజయోత్సవం నిర్వహించారు.
కాగా.. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత జట్టు.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియాను 3-0 తేడాతో ఓడించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను ట్విటర్ మాధ్యమంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
Also Read
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ఇదిలావుండగా.. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించింది. ఆ తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీపై విజయం సాధించింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో ఓడించి.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!