India Qualification Scenario: భారత్‌ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!

  • సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీ
  • భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకం
  • టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు
  • ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలం
India Qualification Scenario

India Qualification Scenario

4 Possible Semi-Final Qualification Scenarios for India: టీ20 వరల్డ్‌కప్‌ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు ఉన్నాయి. అయితే అందులో ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలంగా ఉంది. మిగతా మూడు అదృష్టం అనే చెప్పాలి.

మొదటి సినారియో:
మొదటి సినారియో ప్రకారం.. ఈరోజు వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌ సెమీస్ చేరేందుకు మార్గం సులభమవుతుంది. భారత్ తమ మిగిలిన మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలిస్తే.. నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది.

రెండో సినారియో:
రెండో సినారియోలో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి. అప్పుడు జింబాబ్వేపై కనీసం 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెస్టిండీస్‌పై కూడా ఘన విజయం సాధించాల్సి ఉంటుంది.

మూడో సినారియో:
మూడో సినారియోలో నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. వెస్టిండీస్ గెలిస్తే.. జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఓడిపోవాలి లేదా స్వల్ప తేడాతో గెలవాలి. అదే సమయంలో భారత్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను (జింబాబ్వే, వెస్టిండీస్‌) భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

Also Read: IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

నాలుగో సినారియో:
నాలుగో సినారియోలో దక్షిణాఫ్రికాను జింబాబ్వే ఓడించి, వెస్టిండీస్ కూడా దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. భారత్‌కు మార్గం మళ్లీ సులభమవుతుంది. అప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సెమీఫైనల్‌ బెర్త్ ఖాయం అవుతుంది.

ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే టీమిండియా అవకాశాలు ఇంకా బలంగానే ఉన్నప్పటికీ.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ సెమీస్ చేరుతుందా లేదా? అన్నది చూడాలి మరి.