India Scored 390 Against Sri Lanka in 3rd ODI: గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని కుదిర్చింది. శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ శతకాలతో చెలరేగడంతో భారత్ 390 పరుగులు చేయగలిగింది. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ లంక బౌలర్లపై విలయ తాండవం చేశాడు. తొలుత తన ఇన్నింగ్స్‌ని నిదానంగానే ప్రారంభించాడు కానీ, సెంచరీ చేశాక విజృంభించాడు. ఎడాపెడా షాట్లు బాదుతూ.. పరుగుల వర్షం కురిపించాడు. అందుకే.. చివర్లో స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా పరుగు పెట్టింది. తొలుత టాస్ గెలిచిన భారత్.. శుభారంభాన్నే అందించింది. కెప్టెన్ రోహిత్ (42), శుబ్మన్ కలిసి ఆశాజనకమైన ఓపెనింగ్ అందించారు. తొలి వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చాక.. శుబ్మన్, కోహ్లీ కలిసి లంక బౌలర్లతో ఆటాడుకున్నారు.
Virat Kohli: శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డ్ బద్దలు
మరో వికెట్ పడనీయకుండా.. కోహ్లీ, శుబ్మన్ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగారు. ఈ క్రమంలో సెంచరీ చేసిన శుబ్మన్.. 97 బంతుల్లో 116 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శ్రేయస్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించిన కోహ్లీ.. తనూ శతకం బాదాడు. ఇక అప్పటినుంచి రన్ మెషీన్‌కి అడ్డుఅదుపు లేకుండా పోయింది. శతకం చేశాడో లేదో, ఆకాశమే హద్దుగా చితక్కొట్టాడు. తొలుత 85 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత 25 బంతుల్లోనే 66 పరుగులు చేశాడంటే, ఏ రేంజ్‌లో అతడు పరుగుల వర్షం కురిపించాడో అర్థం చేసుకోవచ్చు. శ్రేయస్ (38) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు (కేఎల్ రాహుల్ (7), సూర్య(4)) నిరాశపరిచారు. కోహ్లీ పుణ్యమా అని.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రజిత, కుమార చెరో రెండు వికెట్లు తీయగా.. కరుణరత్నే ఒక వికెట్ తీశాడు.
KA Paul: పవన్.. రాజకీయాల నుంచి తప్పుకో లేదా నా పార్టీలో చేరు