NTV Telugu Site icon

Aus vs Ind : సెకండ్ వన్డేకు రోహిత్ రీఎంట్రీ.. ఇషాన్ కిషన్ పై వేటు!

India

India

ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా అదరగొట్టింది. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లు కూడా గ్రౌండ్ లో చెలరేగిపోయారు. అదే జోష్ తో ఇప్పుడు వైజాగ్ వేదికగా జరగనున్న రెండో వన్డే కోసం భారత క్రికెటర్లు సిద్దమవుతున్నారు. వైజాగ్ లోని వైఎస్ రాజశేఖర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న సెకండ్ వన్డే కోసం ఆసీస్ తో రోహిత్ సేన తలపడనుంది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత్.. ఆ మ్యాచ్ లో విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తోంది.

Also Read : Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిలో పోలీసుల వీరంగం.. భార్య ఇంట్లో ఉండగా దాడి..

శుక్రవారం జరిగిన వన్డేలో పేలవ బ్యాటింగ్ తో ఓటమిపాలైన ఆసీస్ జట్టు.. తదుపరి మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో బరిలోకి దిగుతుంది. అయితే వైజాగ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్ కు సర్వం సిద్దమౌతున్న వేళ ఉక్కడి మైదానం భారత్ కు అనుకూలంగా ఉండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇక బావమరిది పెళ్లి కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. తనకు అచ్చొచ్చిన అమ్మమ్మ వాళ్ల ఊరిలో టీమిండియా జట్టులోకి రోహిత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అతడి స్థానంలో తొలి వన్డే ఆడిన ఇషాన్ కిషన్ ఇప్పుడు జట్టు నుంచి తప్పుకోనున్నాడు.

Also Read : Newly Elected MLCs Meet CM YS Jagan: సీఎంను కలిసి కొత్త ఎమ్మెల్సీలు.. అభినందించిన వైఎస్‌ జగన్‌

తొలి వన్డేలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు విఫలమయ్యారు. వారి స్థానంలో మరెవరూ రానున్నప్పటికీ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇక సూర్య కుమానర్ కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష లాంటిది. టీ20 ఫార్మాట్ లో అద్బుతంగా ఆడే సూర్య.. వన్డేలో మాత్రం పేలవ ప్రదర్శనతో సరైన ముద్ర వేయేకపోతున్నాడు. ముంబయి వన్డేలో అయితే గోల్డెన్ డన్ గా వెనుదిరిగి నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో వైజాగ్ వన్డేలో అతడికి కీలకం కానుంది. ఒకవేళ ఇందులో అతడు విఫలమైతే తన స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ఆటగాడు టీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : Minister KTR: ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత

ఇక ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ఇంత వరకు విమర్శలు ఎదుర్కొన్న రాహుల్. తొలి వన్డేలో మంచి ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చారు. మరోసారి తన సత్తా ఏంటో ఆసీస్ జట్టుకు కేఏ చూపించాడు. 6,7 స్థానాల్లో మైదానంలోకి అడుగుపెట్టిన వైఎస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా మంచిగా బ్యాటింగ్ చేశారు. దీంతో వీరు వైజాగ్ లోనూ అదే జోరును కొనసాగిస్తే ఇక వారికి తిరుగుండదని అభిమానులు అంటున్నారు.

Also Read : Vishnu Kumar Raju: విష్ణుకుమార్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌.. అది అనివార్యం..!

ఇప్పటి వనరకు జట్టులో ఉన్న నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే రెండో వన్డేకు రోహిత్ సేన సిద్ధం కానుంది. తొలి వన్డేలో సత్తా చాటిన బౌలర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఈ మ్యాచ్ కు కొనసాగనుండగా.. శార్దూర్ ఠాకూర్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నా డు. మరి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను ఆడిస్తారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.. అతడి స్థానంలో చాహల్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తొలి వన్డేలో కుల్దీప్ వికెట్ తీసినప్పటికీ భారీగా పరగులు సమర్పించుకోవడంతో అతడి స్థానంపై డౌట్ నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ కు కూడా అక్షర్ పటేల్. వాషిగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ లు బెంచ్ కే పరిమితం కానున్నారు.