India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్!
- నేడు నమీబియాతో భారత్ పోరు
- అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్
- ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs Namibia: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో భారత్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో అమెరికాపై బ్యాటింగ్‌లో తడబడ్డ టీమిండియా.. నమీబియాపై జోరందుకోవాలని చూస్తోంది. భారత్‌పై గెలవాలంటే నమీబియాకు కష్టమే అయినా.. కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా సూర్య సేన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్‌కు అనుకూలించే ఢిల్లీ పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించాలని చుస్తున్నారు. అయితే రెండో మ్యాచ్‌లో కీలక ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆడడం లేదు. దాంతో సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడడం ఖాయం అయింది. అయితే ఓపెనర్‌గా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుందర్ తిరిగి జట్టులోకి వచ్చి ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ఇషాన్ కిషన్ గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. అతని ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అభిషేక్, కిషన్ స్థానాల్లో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అతని రీఎంట్రీతో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. బుమ్రా ఎంట్రీతో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. బుమ్రా, సుందర్ రీఎంట్రీ జట్టుకు కీలక బలం అవుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
ట్రెండింగ్
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!