Site icon NTV Telugu

Common Wealth Games 2022: భారత్-పాకిస్థాన్ మహిళల క్రికెట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

India Pakistan Match

India Pakistan Match

Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్‌లో భాగంగా మహిళ క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఆలస్యమవుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. వరుణుడు శాంతించాక మైదానాన్ని త్వరగా రెడీ చేసి మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు సన్నాహాలు చేస్తున్నారు. కాగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో అనూహ్యంగా పరాజయం పాలైంది. దీంతో దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.

Read Also: ‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

కాగా పాకిస్తాన్ మహిళా జట్టుపై ఇప్పటివరకు టీమిండియాకు ఉన్న హయ్యెస్ట్ టోటల్ స్కోరు 137/3. 2018లో టీమిండియా మహిళల జట్టు ఈ స్కోరు సాధించింది. అత్యల్ప స్కోర్ 63. 2012లో జరిగిన టీ20 మ్యాచ్‌లో 63 పరుగులకే భారత మహిళా జట్టు పాకిస్తాన్ చేతిలో ఆలౌటైంది. అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డ్ మిథాలీ రాజ్ పేరు మీద ఉంది. ఆమె 73 పరుగులు చేసింది. ఈ స్కోర్‌ను ఇప్పటివరకు మరే టీమిండియా మహిళా ప్లేయర్ అందుకోవడం గమనార్హం.

Exit mobile version