T20 World Cup Semi-Final: ఫ్యాన్స్‌కు ఐసీసీ షాక్.. టీమిండియా సెమీఫైనల్ ముంబైలో జరగదా.?

  • టీమిండియా సెమీ ఫైనల్ ముంబైలో జరగదా..
  • పాక్ గెలుపోటములపై ఆధారపడిన సెమీస్..
Ind Vs Pak

Ind Vs Pak

T20 World Cup Semi-Final: 2026 టీ 20 వరల్డ్ కప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ చేరనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరితే ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం భారత్ తన మ్యాచ్‌‌ను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడే అవకాశం కూడా ఉంది.

భారత్ ఎక్కడ ఆడాలనేది పాకిస్తాన్‌పై ఆధారపడి ఉంది. ఒక వేళ పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సి వస్తే కొలంబోలోనే సెమీ ఫైనల్ జరుగుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీని నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ తన మ్యాచులన్నింటిని శ్రీలంకలో ఆడుతుంది.

Read Also: Sai Pallavi : 7 ఫిలింఫేర్లతో.. సాయి పల్లవి అరుదైన రికార్డ్..

భారత్ సూపర్-8 గ్రూపులో మొదటిస్థానంలో నిలిచి, పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచినా, లేదా భారత్ రెండో స్థానంలో నిలిచి, పాక్ మొదటిస్థానంలో నిలిచినా, ఈ రెండు జట్లు సెమీ-ఫైనల్‌‌లో తలపడుతాయి. ఇలా జరిగితే, మార్చి 5న వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్‌ ఆడకుండా, మార్చి 4న కొలంబోలో సెమీ ఫైనల్ ఆడుతుంది. తేదీ మారడానికి కారణం భారత్‌లో మార్చి 4న హోలీ పండగ ఉండటమే. ‘‘భారత్, పాకిస్తాన్ సెమీస్‌లో తలపడితే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ కాకుండా వేరే టీంలో భారత్ తలపడాల్సి వస్తే సెమీ ఫైనల్ ముంబై వేదికగా జరుగుతుంది’’ ఇలా ఐసీసీ షెడ్యూల్ తయారైంది.