టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి క్వార్టర్‌లో 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న ఇండియా సెకండ్ క్వార్టర్‌లో సంచలనాలు చేయలేకపోయింది. అటు బెల్జియం జట్టు తనదైన శైలిలో విజృంభించి మరో గోల్ చేయడంతో సెకండ్ క్వార్టర్ 2-2తో సమం అయింది. అయితే, మూడో క్వార్టర్‌లో ఎవరూ ఎలాంటి గోల్ చేయలేదు. కానీ నాలుగో క్వార్టర్‌లో బెల్జియం జట్టు పుంజుకొని మరోమూడు గోల్స్ చేయడంతో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. మొదటి క్వార్టర్ లో విజృంభించిన ఇండియా అదే దూకుడును మిగతా అర్ధభాగంలో కొనసాగించినట్టైతే తప్పకుండా విజయం సాధించి ఉండేది. నాలుగో క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు పూర్తిస్థాయి నియంత్రణలో ఆడటంతో మూడు గోల్స్ చేయగలిగింది.
Read: ఆర్ఆర్ఆర్ : “దోస్తీ” సాంగ్ కు మరో వెర్షన్ !