T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ అభిమానులకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక తీపి కబురు అందించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ (T20I) సిరీస్ ప్రారంభ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. భారత ఉపఖండంలో టెలివిజన్ వీక్షకుల సంఖ్యను (TRP) గరిష్టంగా పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
పూర్వపు షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు (ఇంగ్లాండ్ స్థానిక సమయం సాయంత్రం 6:30 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు చూడటం భారతీయ అభిమానులకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లను రాత్రి 10:00 గంటలకే (IST) ప్రారంభించనున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
బ్రాడ్కాస్టర్ల విజ్ఞప్తి మేరకు.. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగిన బ్రాడ్కాస్టర్లతో జరిపిన చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. “ఇంగ్లాండ్ వేదికగా జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయాలను ఈసీబీ (ECB), మ్యాచ్ జరిగే వేదికలు, ప్రత్యర్థి దేశాల క్రికెట్ బోర్డులు, అలాగే స్వదేశీ, విదేశీ బ్రాడ్కాస్టర్ల పరస్పర సంప్రదింపుల తర్వాతే ఖరారు చేస్తారు. ఈ సిరీస్ విషయానికి వస్తే స్కై స్పోర్ట్స్ (యూకే), సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (భారత్) లతో చర్చించి సమయాన్ని మార్చడం జరిగింది” అని నివేదిక పేర్కొంది.
ప్రపంచకప్ విజేతలైన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు అంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాత్రి 10 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావడం వల్ల ప్రైమ్ టైమ్‌లో ఎక్కువ మంది వీక్షకులు టీవీలకు, డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఇది అటు అభిమానులకు, ఇటు ప్రకటనల ద్వారా ఆదాయం పొందే బ్రాడ్కాస్టర్లకు ఇద్దరికీ లాభదాయకమైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!