NTV Telugu Site icon

India vs Sri Lanka : రెండో మ్యాచ్‌లో విక్టరీ.. భారత్‌ ఖాతాలో సిరీస్‌

శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా ,సంజూ శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార రెండు, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఆరంభంలోనే రోహిత్‌ శర్మ, ఇషాన్‌లో ఇంటి బాటపట్టారు. శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌పై ఒత్తిడి తగ్గించాడు. సంజూ శాంసన్‌ క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. తర్వాత వేగం పెంచాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్‌ పథుమ్‌ నిశాంక అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ దసున్‌ శనక మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, హర్షల్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్ పడగొట్టారు.