NTV Telugu Site icon

IND vs WI 2nd ODI: మ్యాచ్‌ మనదే.. సిరీస్‌ కూడా మనకే

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతోన్న రెండో వన్డేలోనూ భారత్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి.. 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 238 పరుగుల ఛేదనలో, వెస్టిండీస్ జట్టు విఫలం అయ్యింది… టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి.. విండీస్‌కు ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.. అయితే, టార్గెట్‌ ఛేదనలో విండీస్‌ బ్యాట్స్‌మన్స్‌ విఫలం అయ్యారు.. 46 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరింది విండీస్‌ జట్టు.. దీంతో.. 44 పరుగుల తేడాతో రెండో వన్డేను.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది టీమిండియా..

Read Also: Farmers Killing: లఖింపూర్ ఖేరి ఘటన.. 4 నెలల తర్వాత మౌనం వీడిన మోడీ