India Cricket Team Should Win Zimbabwe Match To Confirm Semis Birth: పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది కదా.. ఇక సెమీ ఫైనల్స్‌కి వెళ్లిపోయినట్టేనని అనుకుంటే మాత్రం పప్పులే కాలేసినట్టే! ఎందుకంటే.. ఈ సెమీస్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచే భారత్‌కి ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే.. భారత్ తప్పకుండా జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఖర్మ కాలి ఓడిపోతే మాత్రం.. సెమీర్ బెర్త్ చేజారినట్టే!
భారత్ రన్‌రేట్‌తో పోల్చుకుంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ రన్‌రేటే మెరుగ్గా ఉంది. ఒకవేళ భారత్ ఇటు జింబాబ్వే చేతిలో ఓడిపోయి, అటు బంగ్లాదేశ్‌ని పాకిస్తాన్ ఓడిస్తే మాత్రం.. రన్‌రేట్ ప్రకారం పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ఇండియాను వెనక్కు నెడుతుంది. అప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే.. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలి. నెదర్లాండ్స్ చిన్న జట్టు కాబట్టి, దానిపై సౌతాఫ్రికా పైచేయి సాధించడం తథ్యం. అప్పుడు సౌతాఫ్రికాకి ఏడు పాయింట్లు వచ్చి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్తుంది. రన్‌రేట్ దృష్ట్యా పాకిస్తాన్ రెండో స్థానంలోకి వస్తుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆదివారం జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌ని భారత్ తప్పకుండా గెలవాల్సిందే! జింబాబ్వే చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం.. భారత జట్టు పెద్ద కష్టాల్లో పడినట్లే అవుతుంది. ఆల్రెడీ జింబాబ్వేకు పాకిస్తాన్‌ను ఓడించిన ఘనత ఉంది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్ గెలిచి తీరాలి. అప్పుడే.. ఎలాంటి ఆందోళన లేకుండా సెమీస్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకోవచ్చు. పాకిస్తాన్ సెమీస్ ఆశలు మాత్రం.. భారత్, సౌతాఫ్రికా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.
