NTV Telugu Site icon

India vs Ireland 2nd T20: భారత్ ఖాతాలో చెత్త రికార్డ్

India Worst Record In T20

India Worst Record In T20

ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్‌గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్‌ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌లు తొలి బంతికే ఔటై పెవిలియన్‌ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీ20ల్లో టీమిండియా తరఫున ఇన్ని గోల్డెన్‌ డకౌట్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.

కాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థసెంచరీతో రప్ఫాడించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది కానీ.. ఆఖరి బంతి వరకు వచ్చి ఓటమిపాలైంది. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా.. ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా బౌల్‌ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో.. ఐర్లాండ్‌ ఓడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.