India vs Ireland 2nd T20: భారత్ ఖాతాలో చెత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్‌లు తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్‌లో టీ20ల్లో టీమిండియా తరఫున ఇన్ని గోల్డెన్ డకౌట్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
కాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థసెంచరీతో రప్ఫాడించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది కానీ.. ఆఖరి బంతి వరకు వచ్చి ఓటమిపాలైంది. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా.. ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో.. ఐర్లాండ్ ఓడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.
Also Read
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!