Site icon NTV Telugu

Team India Creates History: సచిన్‌ అందుకోలేని రికార్డును సాధించిన ముగ్గురు టీమిండియా ప్లేయర్లు

Team India

Team India

Team India Creates History: ఇంగ్లాండ్‌- భారత్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 50 రన్స్ చేసింది. ఇక, ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. ఒకే సిరీస్‌లో ముగ్గురు 500+ రన్స్ మార్కును దాటేశారు. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో.. ఈ సిరీస్‌లో 500 పరుగుల మార్కును దాటాడు. ఇప్పటికే టీమిండియా సారథి శుభ్‌మన్‌ గిల్‌ (754), ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (532) ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు. ఇలా, ఒకే సిరీస్‌లో మన దేశం తరఫున ముగ్గురు బ్యాటర్లు 500+ రన్స్ చేయడం టెస్టు చరిత్రలో ఇదే మొదటిసారి.

Read Also: OGFirstSingleBlast : OG ఫస్ట్ సింగిల్ మిశ్రమ స్పందన

అయితే, ఒకే సిరీస్‌లో 500+ రన్స్ చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో మొదటి స్థానంలో సునీల్ గావస్కర్‌ (774) ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానానికి గిల్‌ చేరుకున్నాడు. ఇక, మరో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. ఇప్పటి వరకూ ఈ జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (493)కు స్థానం దక్కలేదు. 2007లో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో సచిన్‌ మొత్తం 493 పరుగులే చేశాడు. ఇవే ఓ సిరీస్‌లో అతడికి అత్యధిక రన్స్ అని చెప్పాలి. దీంతో సచిన్‌ అందుకోలేనిది.. ఒకే సిరీస్‌లో ఈ ముగ్గురు బ్యాటర్లు సాధించారని దిగ్గజ, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version