India All Out For 571 In 4th Test Match Against Australia: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరు(480)ను దాటేసిన భారత్.. 571 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 91 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్ (128)తో పాటు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186) సెంచరీలతో చెలరేగడం వల్ల.. భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. అక్షర్ పటేల్ (79), శ్రీకర్ భరత్ (44), పుజారా (42) కూడా బాగా రాణించగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. టాడ్ మోర్ఫీ & నథన్ లియోన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, మిచెస్ స్టార్క్ & మాథ్యూ తలా వికెట్ తీసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. వికెట్ నష్టపోకుండా 3 పరుగులతో నాలుగో రోజు ఆటని ముగించింది.
Rob Own Son: సొంత కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపెట్టాడు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్.. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) అద్భుత సెంచరీలతో రాణించడంతో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లతో విజృంభించగా.. షమీ రెండు వికెట్లు, అక్షర్ & జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. కాగా.. టీ20, వన్డేల్లో ఫామ్‌లోకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు సెంచరీ బాదాడు. టెస్టుల్లో విరాట్‌కి ఇది 28వ శతకం కాగా, అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తంగా 75వ సెంచరీ. మ్యాచ్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వస్తున్న కోహ్లీ.. 241 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. 2019 నవంబర్ 22వ తేదీన బంగ్లాదేశ్‌పై సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. ఇప్పుడు ఇంతకాలం గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత కోహ్లీ కాస్త జోష్ పెంచడాన్ని చూసి.. తప్పకుండా డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ.. 186 వ్యక్తిగత పరుగుల వద్ద మార్సస్‌కి క్యాచ్ ఇచ్చి, ఔటయ్యాడు.
Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి