Site icon NTV Telugu

IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ రేస్‌ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!

Ind Vs Zim Super 8

Ind Vs Zim Super 8

IND vs ZIM Semi Final Scenario: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇప్పుడు సూపర్-8 దశ పోరు నడుస్తోంది. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయంతో టీమిండియా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. భారీ విజయాలు తప్పక సాధించాలి. ఇప్పుడు టీమిండియా సెమీస్ అవకాశాలు పూర్తిగా గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచే విధానం కూడా కీలకంగా మారింది. ఆ సమీకరణాలు ఏంటో తెలుసుకుందాం.

77 పరుగులు:
జింబాబ్వేపై భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే.. కనీసం 200 పరుగులు చేయాలి. ఛేదనలో జింబాబ్వేను 123 పరుగులకు పరిమితం చేసి.. 77 పరుగుల తేడాతో గెలవాలి. అంత పెద్ద మార్జిన్ సాధిస్తేనే నెట్ రన్‌రేట్ గణనీయంగా మెరుగుపడుతుంది. ఇదే సెమీస్ ఆశలను బలపరచే ప్రధాన మార్గం అని చెప్పాలి.

8.4 ఓవర్లు:
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే లెక్కలు కఠినంగా మారతాయి. ఉదాహరణకు జింబాబ్వే 120 పరుగులు చేస్తే.. భారత్ ఆ టార్గెట్‌ను 8.4 ఓవర్లలోపు చేజ్ చేయాలి. అంటే ప్రతి ఓవర్‌లో భారీ రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా సాధారణ విజయంతో సరిపోదు, అత్యంత భారీ చేజ్ తప్పనిసరి.

ఒక్కమాటలో చెప్పాలంటే:
ఇప్పుడు భారత్ ప్రత్యర్థి జట్టును కాదు.. క్యాలిక్యులేటర్లను ఛేజ్ చేస్తున్నట్టే. గెలవడం మాత్రమే కాదు.. ఎంత భారీగా గెలుస్తుందన్నదే సెమీస్ అవకాశాలను నిర్ణయించబోతోంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఈ మ్యాచ్ టీమిండియా భవిష్యత్తును తేల్చే కీలక సమరం కానుంది.

 

Exit mobile version