IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!

  • ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌, యూఎస్‌ఏ మ్యాచ్
  • టీమిండియాదే బ్యాటింగ్
  • ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్
Ind Vs Usa Playng 11

Ind Vs Usa Playng 11

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌, యూఎస్‌ఏ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్‌ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆరుగుర బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు మోనాంక్‌ తెలిపాడు. ఇది స్కోరింగ్ గ్రౌండ్ అని, అందుకే తాము టార్గెట్ ఛేదించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. ప్రపంచకప్ తనకు కల అని, తమపై చాలా అంచనాలు ఉన్నాయని మోనాంక్‌ చెప్పుకొచ్చాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రాలు మ్యాచ్ ఆడడం లేదని చెప్పాడు. బుమ్రా స్థానంలో హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నడని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడనున్నాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం అని సూర్య చెప్పాడు. ఇది ప్రపంచకప్‌ అయినా.. గత రెండు సంవత్సరాలుగా ఎలా ఆడుతున్నామో అదే విధంగా ఆడాలనుకుంటున్నాం అని చెప్పుకొచ్చాడు.

Also Read: Allu Arjun Bollywood Debut: బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?

తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వరుణ్ చకరవర్తి.
అమెరికా: ఆండ్రీస్ గౌస్, సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.